Ooru Palletooru (Balagam ) Lyrics

Ooru Palletooru (Balagam ) Lyrics - Mangli, Ram Miryala, Bheems Ceciroleo


Ooru Palletooru (Balagam )
Singer Mangli, Ram Miryala, Bheems Ceciroleo
Composer Bheems Ceciroleo
Music
Song Writer Kasarla Shyam

Lyrics

ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు

ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క

ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా, నీ పాసుగాల



కోలో నా పల్లె కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే

యాప పుల్లల చేదు నమిలిందే, రామ రామ రామ

తలకు పోసుకుందె... నా నేల తల్లే

అలికి పూసుకుందె... ముగ్గు సుక్కల్నే

సద్ది మూటల్నే సగ బెట్టుకుందే

బాయి గిరక నా పల్లే



హే, తెల్ల తెల్లాని పాలధార లల్ల

పల్లె తెల్లారుతుంటదిరా

గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోనే

జంటగ మోగుత ఉంటయిరా

నాగలి భుజాన పెట్టుకుంటే

దోస్తులు చెయ్యేసినట్టేరా

గొడ్డు గోదా పక్కన ఉంటే

కొండంత బలగం ఉన్నట్టురా



సల్లగాలి మోసుకొచ్చెరా

సేను సెల్కల ముచ్చట్లు

దారి పొడుగు సెట్ల కొమ్మల

రాలుతున్న పూల చప్పట్లు

గడ్డి మోపులు కాల్వ గట్టులు

సెమట సుక్కల్లో తడిసిన

ఈ మట్టి గంధాల



ఊరు పల్లెటూరు... దీని తీరే అమ్మ తీరు

కొంగులోన దాసిపెట్టి... కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు... దీని తీరే కన్నకూతురు

కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు



వంద గడపల మంద నా పల్లె

గోడ కట్టని గూడు నా పల్లె

సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే

ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె

దారంలో ఒదిగిన పూల దండల్లే

రంగుల సింగిడి పల్లే



ఆలు మొగలు ఆడే ఆటలు

అత్త కోడండ్ల కొట్లాటలు

సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు

రచ్చబండ మీద ఆటలు

చాయబండి కాడ మాటలు

వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే సంగతే గమ్మతి



తట్ట బుట్టలల్ల కూర తొక్కులు

సుట్ట బుట్టలల్ల బీడి కట్టలు

చేతనైన సాయం జేసే మనుషులు

మావి పూత కాసినట్టే మనుసులు

ఊరంటే రోజు ఉగాది

సచ్చేదాకా ఉంటది యాది



ఊరు నా ఊరు... దీని తీరే అమ్మ తీరు

కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు... దీని తీరే కన్నకూతురు

కండ్ల ముందే ఎదుగుతున్న... సంబరాల పంటపైరు



వంద గడపల మంద నా పల్లె

గోడ కట్టని గూడు నా పల్లె

సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే, రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే

ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె

దారంలో ఒదిగిన పూల దండల్లే

రంగుల సింగిడి పల్లే




Ooru Palletooru (Balagam ) Watch Video

Comments